మిథున్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి రాంప్రసాద్..!

-

వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు మంది మార్భలంతో నియోజకవర్గాల్లో తిరేగేది కాదు.. అధికారం కోల్పోయిన 8 నెలల తరువాత రాయచోటికి వచ్చాడని ఆరోపించారు. పార్టీ అధికారంలో లేదని చెప్పి అధికార పార్టీ పై విచిత్రమైన ప్రేలాపాలను చేయడం చాలా తప్పు అని దుయ్యబట్టారు.

ఆ రోజు వైసీపీ వారు చేసిన తప్పులకు నేడు 11 సీట్లు వాళ్లకు వస్తే.. 160 సీట్లకు పైగా కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్ని అరచిగగ్గోలు పెట్టినా ఎలక్షన్ వచ్చేది నాలుగున్నర సంవత్సరం తరువాతనే అని పేర్కొన్నారు. వైసీపీ వాళ్లు నీతి, నిజాయితిగా ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ప్రజా క్షేత్రంలో పాలక పక్షం ఏదైనా తప్పు చేస్తే వేలెత్తి చూపించే అర్హత, బాధ్యత వైసీపీ వాళ్లకు ఉందని తెలిపారు మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. అంతకు ముందు ఎంపీ మిథన్ రెడ్డి టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్నమయ్య జిల్లా అభివృద్ధి పనులు ఆగిపోయాయని ఆరోపించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version