ఐపీఎల్ సీజన్ 18 అనగా 2025 కి సంబంధించి ఐపీఎల్ షెడ్యూల్ విడుదల అయింది. మార్చి 23, 2025 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. మే 25, ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్ చెన్నై వేదికగా సీఎస్ కే వర్సెస్ ఆర్సీబీ మధ్య జరుగనుంది. మే 25న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఫైనల్ జరుగుతుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. అదేవిధంగా ఐపీఎల్ కు కొత్త కమిషనర్ ను ఎన్నుకోనున్నట్టు వెల్లడించారు.
గత ఏడాది ఏ జట్టు అయితే ఫైనల్ మ్యాచ్ విజయం సాధించిందో ఆ టీమ్ సొంత మైదానంలో ఫైనల్ జరుగుతుంది. గత ఏడాది కోల్ కతా విజయం సాధించడంతో ఈడెన్ గార్డెన్ లో మే 25న ఫైనల్ జరుగనుంది. గతంలో మార్చి 14 నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించారు. కానీ తాజాగా ఐపీఎల్ మార్చి 23 నుంచి ప్రారంభం అవుతుందని వెల్లడించారు.