‘ గ్యాంగ్ లీడ‌ర్ ‘ ప్రీమియ‌ర్ క‌లెక్ష‌న్స్‌… నాని దుమ్ము లేపాడు..

-

నేచుర‌ల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం రిలీజ్ అయి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ యేడాది జెర్సీ సినిమాతో ప్రేక్షకులను అలరించిన నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హ‌లో లాంటి డిజాస్ట‌ర్‌ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న కుమార్ గ్యాంగ్ లీడర్ సినిమాతో హిట్ సొంతం చేసుకున్నాడు.

సినిమాలో హీరో నాని కామెడీ టైమింగ్ తో పాటు ఎమోషన్ లు… ట్విస్టులు అని ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినట్టు తెలుస్తోంది. యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ పరంగా కూడా గ్యాంగ్ లీడర్ చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించింది. లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం గ్యాంగ్ లీడర్ యూఎస్ లో ప్రీమియర్స్ ద్వారా 177 లొకేషన్స్ నుండి $1,82,679 వసూళ్లు రాబట్టింది. మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో ఫ‌స్ట్ వీకెండ్ అక్క‌డ మంచి వ‌సూళ్లు సాధించ‌నుంది.


నానికి యూఎస్ మార్కెట్‌లో మంచి బేస్ ఉన్న నేప‌థ్యంలో గ్యాంగ్ లీడ‌ర్ అక్క‌డ మంచి వ‌సూళ్లు సాధించ‌డం క‌న్‌ఫార్మ్‌గా క‌నిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ నటించగా, సీనియర్ నటి లక్ష్మీ, శరణ్య ఇతర కీలకపాత్రలలో నటించడం జరిగింది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news