ఏపీలో వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి భారీ ఎత్తున నగదు, వస్తువులను రికవరీ చేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉండగా.. మీడియా ఎదుట వారిని, వారు దోచిన సొత్తును ఉంచారు.
పల్నాడు జిల్లాల్లో ముఠాగా ఏర్పడి వరుసగా చోరీలు చేస్తున్న 9 మంది దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.25 లక్షల విలువ చేసే 18 బైక్స్, 170 గ్రాముల బంగారం, 4 కిలోల వెండి, రూ.10 వేల నగదు, టీవీలు స్వాధీనం చేసుకున్నారు. చిలకలూరిపేట, వెల్దుర్తి, ఐనవోలు, ఈపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు ఇళ్లల్లో వీరు చోరీలు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.