దేశ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో దాని గురించి భయం అవసరం లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేసారు. ఐపీఎల్ నిర్వహణపై ఎటువంటి సందేహాలు వద్దని, టోర్నీ జరిగి తీరుతుందని స్పష్టం చేసారు. కరోనా నేపధ్యంలో ఐపిఎల్ జరిగే అవకాశం లేదని అన్నారు. ఈ తరుణంలో స్పందించిన గంగూలీ ఐపీఎల్ విషయంలో ఎటువంటి సందేహం వద్దని,
టోర్నీ సాఫీగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వివరించాడు. షెడ్యూలు ప్రకారమే టోర్నీ జరుగుతుందని గంగూలీ వ్యాఖ్యానించాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని బోర్డు స్పష్టం చేసింది. ఫ్రాంచైజీలు, ఆయా జట్లు బస చేసే హోటళ్లు, ఎయిర్‌లైన్స్, బ్రాడ్‌కాస్ట్ సిబ్బందికి ప్రభుత్వం సూచించిన జాగ్రత్తల గురించి తెలియజేస్తామని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.
ముఖ్యంగా ఆటగాళ్లు అభిమానులకు దూరంగా ఉండాలని, వారితో కలిసి సెల్ఫీలకు పోజివ్వడం, షేక్ హ్యాండ్స్ వంటివి చేయరాదని సూచించారు. కాగా కరోనా వైరస్ కేసులు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 30 మందికి పాజిటివ్ గా తేలింది ఈ వైరస్. ఎక్కడిక్కడ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్రం కూడా చర్యలు తీసుకుంటుంది.