బ్రిటీష్ వాళ్ళు కట్టిన హిందూ దేవాలయం ఏదో తెలుసా…?

-

ఆమె మనసు ఉద్విగ్నంగా ఉంది. యుద్దానికి వెళ్ళిన భర్త క్షేమ సమాచారం లేదు. ఏమయ్యాడో తెలీదు. పది రోజుల క్రితం ఉత్తరం వచ్చింది. ఆ తరువాత అజా అయిపు లేదు. గుర్రం పై స్వారీ చేస్తూ తనకు తెలియకుండానే కొండ పైకి ఎక్కింది. ఐ మిస్ యూ మార్టిన్ , ఐ మిస్ యూ సో మచ్ అంటూ కల్నల్ మార్టిన్ కోసం అతని భార్య అరుస్తుంది. కళ్ళ వెంట నీళ్లు కారినా మర్టర్ బొమ్మ మాత్రం స్పష్టంగా తెలుస్తుంది.

ఇంతలో ఎక్కడి నుంచో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ గణ గణ గంటల శబ్దం ఆమెకు వినిపించింది. అప్రయత్నంగా ఆమె అటు వైపు వెళ్ళింది. అక్కడ ఒక శిధిల దేవాలయం, అందులో దీపాల వెలుగు లో, పొగ, ఘంటారావాల మధ్యలో దేదీప్య కాంతులు వెదజల్లుతూ లింగాకారంలో దర్శనమిచ్చాడు. బైద్య నాథుడు. ఆమె గుర్రం దిగి చెప్పులు విడిచి లోపలికి వచ్చి నిలబడింది. పూజారి వచ్చి ‘మేమ్ సాబ్’ తీర్థం తీసుకోండి అని ఏమిటి దేనికో బాధ పడుతున్నారు అని అడుగుతాడు.

దానికి ఆమె జరిగిన కథ అంతా వివరిస్తుంది. దానితో పూజారి భయపడకండి ఈ బైద్యా నాథ్ మహాదేవుడు అందరినీ కాపాడతాడు. మీరు నిష్టగా ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని పదకొండు రోజుల పాటు జపించండి. అని చెబుతాడు. ఆమెకు ఏమి అనిపించిందో తెలీదు కానీ ఆ మర్నాటి నుండి అన్నపానాలు మానేసి గదిలో కూర్చుని ఓం నమః శివాయ అని జపించటం మొదలు పెట్టింది.

ఇలా పది రోజుల పాటు జపించాక పదకొండో రోజు పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే సాయంత్రానికి సేవకుడు వచ్చి ఉత్తరం ఇచ్చాడు. దాని సారాంశం ఏమిటి అంటే మమ్మల్ని ఆప్గన్లు చుట్టూ ముట్టారు. ఇక మా పని ఐయ్యిపోయింది అనుకునే సమయంలో ఎటు నుంచో ఒక తెల్లని మనిషి ఒంటి నిండా బూడిద పూసుకుని చేతిలో త్రిశూలం తో వాళ్ళ మీద విరుచుకు పడ్డాడు. ఆయన ధాటికి వాళ్లంతా పరారీ అయ్యారు. వాళ్ళతో పాటే ఆయన కూడా వెళ్లిపోయారని చెప్పారు. ఆ గుడిని అభివృద్ధి చేయడానికి అప్పట్లో మార్టిన్ 15 వేలు ఇచ్చారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version