ఐపీఎల్ ముగిసింది. దుబాయ్ వేదికగా జరిగిన టోర్నమెంట్ లో ముంబై ఇండియన్స్ విజయం అందుకుంది. ప్రస్తుతం ఇండియా క్రికెట్ టీమ్ ఆస్ట్రేలియా పయనమైంది. ఐతే ఆస్ట్రేలియా టూర్ కి ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లని ఎంచుకోకపోవడంపై బీసీసీఐ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్ లో అద్భుతంగా ఆడిన కోల్ కతా నైట్ రైడర్స్ కి చెందిన వరుణ్ చక్రవర్తి, సన్ రైజర్స్ ఆటగాడు వృద్ధిమాన్ సాహాలని దూరం పెట్టడం చాలా మందికి బాధించింది.
ఈ విషయమై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సమాధానం ఇచ్చారు. గాయం కారణంగా వరుణ్ చక్రవర్తి స్థానంలో సన్ రైజర్స్ జట్టుకి చెందిన పేసర్, టి నటరాజన్ కి అవకాశం ఇచ్చాం. వృద్ధిమాన్ సాహా తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అది పూర్తిగా నయమై ఆటలోకి దిగడానికి కొంత సమయం పడుతుంది. అందుకే అతన్ని వన్డే, టీ ట్వంటీలకి దూరం పెట్టి, టెస్టులకి తీసుకున్నాం. అప్పట్లోగా అతడు పూర్తిగా ఫిట్ గా తయారవుతాడు.
జనాలకి ఆటగాళ్ళ గాయాల గురించి తెలియదు. జట్టులోకి తీసుకునే ముందు వారెంత ఫిట్ గా ఉన్నారో నిర్ధారించుకుని, భవిష్యత్తులో వారికి ఎలాంటి సమస్య రానివ్వకుండా చూసుకున్నాకే ఆటలోకి తీసుకుంటాం అని, జనాలకి ఇలాంటివేమీ తెలియవని అన్నాడు.