రైస్ కోసం వచ్చి కౌంటర్లో చోరీ.. దొంగలను పట్టించిన యాజమాని

-

సినీ ఫక్కీలో రైస్ కొనేందుకు వచ్చి ఓనర్‌ను దారి మళ్లించి కౌంటర్లోని నగదును దొంగిలించాడో వ్యక్తి. ఇద్దరు వ్యక్తులు షాపునకు రాగా ఓ వ్యక్తి ఓనర్ను దారి మళ్లించగా మరో వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. దీంతో ఆ షాపు యాజమాని తెలివిగా వారిని పోలీసులకు పట్టించాడు.

ఖమ్మం జిల్లాకు 25 కిలోమీటర్ల దూరంలో గల నేలకొండపల్లి మండల కేంద్రంలో రమేష్ అనే వ్యక్తి రైస్ షాపు నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తులు తమకు రైస్ కావాలని షాపుకు వచ్చారు. రమేష్ వారికి కొన్ని రైస్ చూపించగా అవి నచ్చలేదనడంతో మరో రూమ్‌లో ఉన్న రైస్ చూపించేందుకు వెళ్ళాడు. రైస్ కావాలని వచ్చిన వ్యక్తుల్లో ఓ వ్యక్తి షాపు యజమానితో రూమ్‌లోకి వెళ్లగా బయట ఉన్న వ్యక్తి దుకాణం కౌంటర్‌లోని నగదు చోరీ చేశాడు. సీసీ టీవీల్లో ఆ దృశ్యాలు మొత్తం రికార్డు అయ్యాయి. దీంతో వాటి ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version