బ్రేకింగ్‌ : పార్టీ మార్పుపై గంటా క్లారిటీ..!

-

టీడీపీ నేత, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారే అవకాశమున్నట్లు కొద్దిరోజులుగా పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అయితే.. ఈ వార్తలపై గంటా ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు ఆదేశాలతో నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు, వార్డుల విభజన జరిగాక సమర్ధులైన వారిని నియమిస్తామని గంటా తెలిపారు. దీంతో.. గంటా పార్టీ మారతారన్న ప్రచారానికి తెరపడినట్టయింది. వాస్త‌వానికి గ‌తంలో విశాఖ జిల్లా సమీక్షా సమావేశానికి చంద్రబాబు వచ్చినప్పుడు.. ఆయన వచ్చారు. ఆ తర్వాత మళ్లీ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఆ తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీతో టచ్‌లోకి వెళ్లారు.

ఢిల్లీ వెళ్లి సీఎం రమేష్ సాయంతో.. మోడీ, అమిత్ షాల అపాయింట్‌మెంట్లు తీసుకుని ఫోటోలు దిగి వచ్చారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరడం ఖాయమని ప్రచారం ఊపందుకుంది. అయితే గంటా ముందుగా ఆమ‌న్ను నిరంతరం వార్తల్లో ఉంచుతున్న మీడియాకు కృతజ్నతలు తెలిపారు. ఆ త‌ర్వాత పార్టీ మార్పుపై వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండించారు. పార్టీ మార్పుకు ఇప్పటికే నాలుగైదు ముహూర్తాలు మీరే పెట్టేశారంటూ విరుచుకుప‌డ్డారు. ఏదైనా ఫంక్షన్లలో ఇతరపార్టీల వ్యక్తులను కలుస్తుంటాం.. అలా అని వాటిని రాజకీయాలతో ముడిపెట్టలేమ‌న్నారు. అలాగే నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీకు చెప్తానని అనేకసార్లు స్పష్టం చేసిన‌ట్టు ఆయ‌న గుర్తు చేశారు. ఏదైమైనా పార్టీ మార్పుపై వ‌స్తున్న వార్త‌ల‌కు గంటా క్లారిటీ ఇచ్చి తెర‌దించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version