రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో అంతర్గత వార్ భయంకరంగా జరుగుతోంది. అధినేత చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న నాయకులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు హాజ రు కా కుండా.. పార్టీ పిలుపు నిచ్చిన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకుండా తమ పంతం నెగ్గించుకుంటు న్నారా? లేక.. పార్టీ నుంచి ఏకంగా తప్పుకొనే ప్లాన్లో భాగంగా ఇలా వ్యవహరిస్తున్నారా ? అనే సందేహాలు తెరమీదికి వస్తున్నాయి. వైసీపీ అదికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చంద్రబాబు పలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. కొన్నింటిలో స్వయంగా పాల్గొన్నారు.
అయితే, బాబు పిలుపిచ్చిన కార్యక్రమాల్లో చాలా మంది నాయకులు దూరంగా ఉన్నారు. వీరిలో ప్రధానం గా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ ఏడాది ఎన్నికల్లో గెలిచిన ఆయన అప్పటి నుంచి పార్టీ మారతారనే ప్రచారం సాగుతోంది. అయితే, ఆయన ఖండిస్తూనే ఉన్నారు. కానీ, బాబు కార్యక్రమాలకు పిలుపు నిచ్చినా.. ఇటీవల విశాఖలో సమీక్ష కార్యక్రమం నిర్వహించినా కూడా గంటా ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.
ఈ పరిణామాలను బట్టి.. ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారనే విషయం స్పష్టంగా తెలిసిపోయింది.
అయితే, తాజాగా చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇసుక దీక్షకు కూడా గంటా ఆయన కూటమిగా పేర్కొనే ఎమ్మెల్యేలు .. వాసుపల్లి గణేష్, గణబాబు, నిమ్మల రామానాయుడు వంటి దాదాపు ఐదుగురు వరకు డుమ్మా కొట్టారు., నిజానికి టీడీపీ చేపట్టిన ఇసుక దీక్షను లైట్‌గా తీసుకునే పరిస్థితిలేదు. సాక్షాత్తూ .. పార్టీ అధినేత చంద్రబాబే 12 గంటల పాటు దీక్షకు కూర్చుకున్నారు.
ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా పార్టీ అభిమానులు, నాయకులు కూడా హాజరుకావాల్సి ఉంది. అయితే, గంటా వర్గంగా పేరున్న ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రం డుమ్మా కొట్టడం చర్చకు వస్తోంది. ఉద్దేశ పూర్వకంగానే వీరు దూరంగా ఉన్నారని అంటున్నారు. ఏదో ప్రత్యేక వ్యూహంతోనే వీరు బాబు దీక్షకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతోందో చూడాలి.