పిచ్చి పిచ్చి ఆలోచనలకు వట్టివేర్లతో చెక్ పెట్టొచ్చు!

-

ప్రశాంతంగా పూజ చేయాలన్నా, పుస్తకం చదువాలన్నా పిచ్చి ఆలోచనలు వెంటాడుతూనే ఉంటాయి. వాతావరణంలో చల్లగా ఉన్నా శరీరంలో వేడి అధికం అవ్వడంతో జలుబు, దగ్గుతో మానసికంగా హాయిగా ఉండలేరు. వీటన్నింటికీ ఒకటే పరిష్కారం. పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా కూల్‌గా ఉంచేందుకు వట్టి వేర్లు ఎంతో సహాయపడుతాయి.

వట్టివేర్లు ఎక్కడపడితే అక్కడ కనిపించవు. ఇవి భారతదేశంలోనే పుట్టాయి. వీటిని ఖుస్ అంటారు. ఇది ఒక గడ్డిమొక్క. శ్రీశైలంలాంటి ప్రదేశాలలో ఇలాంటి వట్టివేర్లను అమ్ముతుంటారు. ఈ వేర్ల వల్ల చాలా ఉపయోగాలున్నాయని చాలామందికి తెలుసు. కాకపోతే ఎలా వాడాలో ఎవరికీ సరిగా తెలియదు. తెలిస్తే వాటి వాడకం వెంటనే మొదలుపెడుతారు. ఇదేమి పెద్ద సీక్రెట్ ఏమీ కాదు. కష్టం అంతకన్నా కాదు.

ఎలా వాడాలి?

ఓ మట్టికుండలో తాగునీరు పోసి అందులో వట్టివేర్లను వెయ్యాలి. వేర్లు నీటిలో పూర్తిగా మునగాలి. కొన్ని గంటటలు ఉంచాలి. ఆ తర్వాత నీటిని వడగట్టి ఆ నీటిని తాగేయాలి. అంతే… వట్టివేర్లు నీటిని చల్లబరుస్తాయి. అంతేకాదు శరీరంలో వేడిని తగ్గిస్తాయి. చల్వ చేస్తాయి. ఇవి సహజసిద్ధంగా విషవ్యర్థాలు, విషసూక్ష్మక్రిములతో పోరాడుతాయి. ఇవి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. శరీరంగా చల్లబడడంతో ఒత్తిడి, ఆందోళనలకు గురవ్వకుండా గొడవలు వంటి వాటి జోలికి పోకుండా ఉంటారు. పచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా పని మీదనే ఏకాగ్రత సారిస్తారు. వట్టివేర్ల నీరే కాదు దానినుంచి తయారు చేసిన తైలంతో కూడా ప్రయోజనాలున్నాయి. ఈ తైలం మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇందులో యాంటీసెప్టిక్ గుణాలుంటాయి. ఈ ఆయిల్‌ను చర్మం, జుట్టుకి వాడినప్పుడు శుభ్రంగా ఉంచుతుంది. మొదట నురుగులా వచ్చి ఆ తర్వాత క్లీన్ చేస్తుంది.

ఒకసారి వాడిన వేర్లను తరచూ పడేస్తుంటారు. వీటితో కూడా ఉపయోగం లేకపోలేదు. కొన్ని కంపెనీలు వాడిన వేర్లను సేకరించి వాటితో పరుపులు తయారు చేస్తున్నారు. ఈ పరుపులపై సేదతీర్చుకుంటే చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. ఆక్సిజన్ లెవల్స్ కూడా పెరుగుతాయి. ఈ వట్టివేర్లను చాలా తక్కువ రేటుకి కొనుగోలు చేసి వాటితో మందులు తయారు చేస్తారు. ఆ మందులను అధిక మొత్తంలో అమ్ముతున్నా వాటిని ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ వట్టివేర్లు అన్నిచోట్ల దోరుకవు. ఇలాంటి సహజసిద్ధ మూలికల్ని ప్రజలకు డైరెక్టుగా అలవాటు చేసుకోవాలి. భారతీయులు తక్కువ ఖర్చుతోనే ఆరోగ్యాన్ని చక్కబెట్టుకునే రోజులు రావాలని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version