కరోనా మనిషి అలవాట్లలో చాలా మార్పు తీసుకొచ్చింది. అలాగే మహేశ్‌నూ మార్చేసింది. దీనివలన ఆయన ఇబ్బందిపడ్డాడు. దారిలో పడ్డాడనుకున్న మహేశ్‌ను యదాస్థితికి చేర్చింది కరోనా. ఈ మహమ్మారి రాకతో.. మహేశ్ కెరీర్‌లో రెండేళ్లు గ్యాప్ వచ్చింది. సరిలేరునీకెవ్వరు రిలీజై ఏడాది అవుతోంది. ఇంకో ఏడాది వెయిట్ చేస్తాగానీ.. మహేశ్ మూవీ చూడలేరు.
ఐదేళ్ల క్రితం వున్నట్టు మహేశ్ ప్రస్తుతం లేడు. గతంలో ఫ్లాప్ వస్తే… భయపడిపోయి.. ఒకటికి నాలుగుసార్లు ఎలాంటి కథ ఎంచుకోవాలి? ఎవరి డైరెక్షన్‌లో నటించాలని ఆలోచించేవాడు. ఈలోగా ఒకట్రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. మహేశ్ మూవీ రావాలంటే.. రెండేళ్లు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వుండేది. కానీ.. ఇప్పుడు ఏడాదికి ఒక సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు. కరోనా రాకతో.. మరోసారి గ్యాప్‌లో పడిపోయాడు సూపర్‌స్టార్.
ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరుతో.. ఫస్ట్ 100 కోట్ల మార్క్ దాటిన మహేశ్ ఇదే దూకుడుతో.. పరశురామ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంతలో కరోనా రావడంతో.. ఈమధ్యనే సర్కారువారిపాట షూట్ లాంఛనంగా మొదలుపెట్టినా.. రెగ్యులర్ షూటింగ్ ఇంతవరకు సెట్స్‌పైకి వెళ్లలేదు. అమెరికా బ్యాక్డ్రాప్ కథ కావడంతో.. చిత్ర యూనిట్ కోసం వీసాలు ట్రై చేశారు నిర్మాతలు. ఇంతలో కరోనా సెకండ్ ఫేజ్ అమెరికాలో విజృంభించడంతో… అక్కడి షెడ్యూల్‌ను వాయిదా వేశారు. త్వరలో హైదరాబాద్‌లోనే షూటింగ్ స్టార్ట్ చేసి.. 3నెలలపాటు ఇక్కడే చిత్రీకరిస్తారు. ఆతర్వాత అమెరికా షెడ్యూల్ ప్లాన్ చేశారు దర్శకనిర్మాతలు.
సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేశ్ మూవీ చూడాలంటే రెండేళ్లు వెయిట్ చేయాలి. సర్కారువారిపాట ఎప్పుడు మొదలైనా.. 2022 సంక్రాంతివరకు రిలీజ్ కాదు. సరిలేరునీకెవ్వరు మాదిరి సంక్రాంతి బరిలో సర్కారువారిపాట దిగుతుంది. మహేశ్ ఆటాపాటా చూడాలంటే.. ఇంకా ఏడాదికి పైగా వేచివుండాల్సిందే.