యానాం వద్ద గోదావరి పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీకేజీ..

-

గోదావరి నదిలో గ్యాస్ లీకేజీ అవుతోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. యానాం దరియాలతిప్ప కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్య ఈ ఘటన వెలుగుచూసింది.శనివారం తెల్లవారు జాము నుంచి గోదావరిలో గ్యాస్ పైపులైన్ లీక్ అవుతున్నట్లు స్థానికులు గుర్తించారు. అయితే, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప ప్రాంతం నుంచి యానాం దరియాల తిప్ప మీదుగా ONGC చమురు సంస్థ గోదావరిలో వేసిన పైపులైను నుంచి ఈ గ్యాస్ లీక్ అవుతున్నట్లు సమాచారం. లీకేజీ కారణంగా గోదావరిలో సుడులు తిరుగుతూ, బుడగలతో కూడిన నీరు పైకి ఉబికి వస్తోందని స్థానికులు చెబుతున్నారు.

ఈ ఘటనతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కిలోమీటర్ల మేర గ్యాస్ వాసన వస్తోందని, మంటలు చెలరేగే అవకాశం కూడా ఉందని, అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ లీక్ కాకుండా చర్యలు తీసుకోవాలని మత్స్య కారులు డిమాండ్ చేస్తున్నారు.ఇదిలాఉండగా, గోదావరి జిల్లాలో ఇలాంటి గ్యాస్ లీక్ ఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయని, కొన్నిసార్లు మంటలు కూడా చెలరేగి భారీ నష్టాన్ని మిగిల్చాయని పలువురు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version