దేశంలో నంబర్ వన్ బిజినెస్‌మ్యాన్ గౌతమ్ అదానీ త్వరలోనే మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. తన వ్యాపార విస్తరణలో భాగంగా ఎన్డీటీవీలో వాటాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. అదానీ గ్రూప్‌నకు చెందిన ఏఎన్ఎమ్ఎల్, ఎన్డీటీవీలో రూ.493కోట్లతో 26 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు పంపింది. అదానీ గ్రూప్‌నకు చెందిన విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇప్పటికే ఎన్డీటీవీ ప్రమోటర్ సంస్థ అయిన ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 29.18 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు కసరత్తు చేసింది.
అదానీ గ్రూప్‌నకు చెందిన విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్, ఏఎమ్‌జీ మీడియా నెట్‌వర్క్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ సంయుక్తంగా ఎన్డీటీవీకి చెందిన కోటీ 67 లక్షల 62వేల 530 షేర్లను ఒక్కోటి రూ.294 చొప్పున కొనుగోలు చేస్తామని ప్రతిపాదించాయి. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో ఎన్డీటీవీ షేర్ విలువ రూ.366.20గా ఉంది. ఈ ప్రతిపాదనలు విజయవంతమైతే ఎన్డీటీవీలో 55 శాతం వాటాలతో మెజార్టీ వాటాదారుగా ఆదానీ గ్రూప్ నిలవనుంది.