గీతా సమోటా.. భారతదేశానికి చెందిన ఈ యువతి, అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించింది. కిలీమంజారో పర్వతంపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. 5895మీటర్ల ఎత్తైన శిఖరాన్ని గీతా సమోటా అధిరోహించింది. తక్కువ రోజుల్లో పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించింది. ఈ మేరకు భారత దేశ నలుమూలల నుండి గీతా సమోటాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశం గర్వపడేలా చేసిన గీతా సమోటాకి చప్పట్లు కొట్టి మరీ అభినందనలు తెలియజేస్తున్నారు.
నెలరోజుల క్రితం యూరప్ లోని అత్యంత ఎత్తైన ఎల్ ప్రెసో శిఖరాన్ని అధిరోహించింది. నెలరోజుల తర్వాత ఇప్పుడు ఆఫ్రికాలోని కిలిమంజారోని అధిరోహించింది. నెల రోజుల వ్యవధిలో రెండు శిఖరాలను అధిరోహించిన భారతీయ వనితగా గీతా సమోటా రికార్డు క్రియేట్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా గీతా సమోటాపై ప్రశంసల జల్లు కురుస్తుంది. భారత ఛాతి ఉప్పొంగేలా చేసిన భారత వనిత సాహసానికి దేశం మొత్తం గర్వపడుతుంది.