గుజరాత్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రానున్నారు. గత ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా చేసారు. చాలా సడెన్ గా విజయ్ రూపానీ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కి అందజేసారు. అది కూడా ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం జరిగిన కొద్ది నిమిషాల తర్వాతే విజయ్ రూపానీ రాజీనామా సమర్పించడం విశేషం. ఐతే ప్రస్తుతం గుజరాత్ కి కొత్త ముఖ్యమంత్రి ఎంపిక జరగనుంది. ఈ మేరకు పరిశీలకులుగా కేంద్రం నుండి ప్రహ్లాద్ జోషి,నరేంద్ర సింగ్ తోమర్ ఉండనున్నారు.
గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. ముఖ్యమంత్రి పదవికి పోటీగా నలుగురు అభ్యర్థులు కనిపిస్తున్నారు. ప్రపుల్ పటేల్, మాన్సఖ్ మాండవియా, పురుషోత్తం రూపాలా, నితిన్ పటేల్ సీఎం రేసులో ఉన్నారు. మద్యాహ్నం 2గంటలకు శాసన సభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖమత్రి అభ్యర్థిగా ఎవరు నియమింపబడతారనేది చూడాలి.