భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ బాధ్యతలు చేపట్టారు. త్రివిధ దళాల అధిపతుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రభుత్వ సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగానూ అనిల్ చౌహాన్ విధులు నిర్వర్తించనున్నారు.
సైన్యం, నౌక, నావిక దళాల అవసరాలను తీర్చేందుకు తాను కృషి చేస్తానని అనిల్ చౌహాన్ అన్నారు. బాధ్యతలు చేపట్టకముందు అనిల్ చౌహాన్.. జాతీయ యుద్ధస్మారకం వద్ద తన తండ్రి సురేంద్ర సింగ్ చౌహాన్‌తో కలిసి అమరవీరులకు నివాళులు అర్పించారు. దిల్లీలోని సౌత్ బ్లాక్‌లో సైనికుల గౌరవవందనాన్ని స్వీకరించారు.
దాదాపు 40 ఏళ్లపాటు సైన్యంలో సేవలు అందించారు లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్. అనేక కీలక పదవుల్లో పనిచేశారు. జమ్ముకశ్మీర్, ఈశాన్య భారత్‌లో తీవ్రవాద కార్యకలాపాల్ని అడ్డుకోవడంలో ఆయనకు విశేష అనుభవం ఉందని కేంద్రం ప్రకటనలో పేర్కొంది. ఆయన జీవితంలోని కొన్ని కీలక ఘట్టాలు.