అసలు నీరా అంటే ఏంటో తెలుసా.. మంత్రికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్న

-

హైదరాబాద్​లో ఇటీవలే రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్​లో నెక్లెస్ రోడ్డు వద్ద నీరా కేఫ్​ను చాలా గ్రాండ్​గా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నీరా గురించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. అసలు శ్రీనివాస్ గౌడ్​కు నీరా గురించి తెలుసా అంటూ ప్రశ్నించారు. ఇంకా ఏమన్నారంటే..?

నీరా కేఫ్‌లు అంటూ ఏదో కొత్తగా సాధించినట్లు ప్రచారం చేసుకుంటున్నారని.. అసలు నీరా ఎప్పుడు తాగాలో తెలుసా అంటూ రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. సూర్యరశ్మి పడకముందే నీరా తాగాలని, ఆలస్యమైతే అది కల్లుగా మారుతుందన్న విషయం మంత్రికి తెలుసని అనుకోవడంలేదు అని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో అనధికారికంగా కొనసాగుతున్న మద్యం గొలుసు దుకాణాలతో గీత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని, వాటిని నిలువరించకుండా గీత, బీమా అంటూ మభ్యపెట్టడం సరికాదని అన్నారు. కేవలం గీత కార్మికులకే కాకుండా అన్ని వర్గాల కార్మికులకు ప్రమాద బీమా వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆర్థికంగా దిగువన ఉన్న(బీపీఎల్‌) వారందరికీ ప్రమాద బీమా వర్తింపజేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version