మహిళల సంక్షేమం అలాగే అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలని అమలు చేస్తున్నాయి. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యతను ఇవ్వాలని చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ ని అమలు చేసింది. దీంతో తక్కువ మొత్తంలోనే ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ 2023 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు రెండేళ్ల పాటు అందుబాటులో ఉండే వన్ టైం స్కీమ్.
ఈ స్కీమ్ లో మహిళలు, బాలికలకు సురక్షితమైన ఆకర్షణీయమైన సేవింగ్స్ ఆప్షన్స్ ఉన్నాయి రెండేళ్ల కాలానికి మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద అకౌంట్ ఓపెన్ చేయడానికి మహిళలు మాత్రమే అర్హులు. డిపాజిట్లుకు వయోపరిమితి లేదు. ఏ వయసులో వారైనా సరే ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీం కింద 7.5% వడ్డీ వస్తుంది ఇతర స్మాల్ సేవింగ్స్ కిమ్స్ కంటే ఎక్కువ వడ్డీ వస్తుంది. కనీసం వెయ్యి నుంచి రెండు లక్షల వరకు ఇందులో పెట్టవచ్చు.
పార్షియల్ అమౌంట్ విత్ డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం కింద ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు. మైనర్ బాలిక పేరు మీద గార్డియన్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అవుతుంది. రెండేళ్ల డిపాజిట్ వ్యవధితో 1,50,000 ఇన్వెస్ట్ చేస్తే టర్మ్ ముగింపు అయ్యే సరికి .1,74,033 వస్తుంది. వడ్డీ రూపంలోనే 24,033 రూపాయలు వస్తాయి. అదే మీరు రెండు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 2,32,044 వస్తాయి.