రూ.58 పొదుపు చేస్తే.. 8 లక్షలు చేతికి..ఈ ప్రభుత్వ స్కీమ్ తో..!

-

చాలా మంది ఈ మధ్య కాలం లో ఎక్కువగా డబ్బులని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇలా ఇన్వెస్ట్ చేయడం భవిష్యత్తు లో ఏ ఇబ్బంది కూడా ఉండదు. పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఎన్నో పథకాలు ఉన్నాయి. దీని ద్వారా డబ్బులు పోవడం, నష్టపోవడం వంటి ప్రమాదం ఉండదు. చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేసినా మెచ్యూరిటీ సమయానికి ఎక్కువ డబ్బులు వస్తాయి. రిస్క్ కూడా ఉండని స్కీమ్స్ వున్నాయి. LIC కూడా ఎన్నో స్కీముల ని తీసుకు వచ్చింది.

వాటిలో ఎల్‌ఐసీ ఆధార్ శిలా స్కీమ్. మహిళల ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని తీసుకు వచ్చారు. మహిళలు కనిష్టంగా రూ.75 వేలు, గరిష్టంగా రూ.3 లక్షల పాలసీలను కొనచ్చు. ఈ స్కీమ్ ని చిన్న, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని తీసుకు వచ్చారు. ఇక అర్హత వివరాలని చూస్తే… 8 సంవత్సరాల నుంచి 55 ఏళ్ల వరకు మహిళలు ఎవరైనా సరే ఎల్‌ఐసీ ఆధార్ శిలా పాలసీలో చేరవచ్చు.

ఈ స్కీమ్ లో 10 సంవత్సరాల నుంచి గరిష్టంగా 20 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చెయ్యచ్చు. రోజుకు కేవలం రూ.58, నెలకు రూ. 1740 చొప్పున సంవత్సరానికి రూ.21,918 అవుతుంది. 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే రూ. 4,29,392 అవుతుంది. మెచ్యూరిటీ సమయానికి రూ. 7,94,00 అందుతుంది. రోజుకు రూ.29 ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడి రూ.2,14,000 అవుతుంది. మీ రిటర్న్స్ రూ.3,97,000 అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news