15 వేలు సాలరీ వస్తుందా…? స్టేట్ బ్యాంకు లో పర్సనల్ లోన్ చాలా ఈజీ…!

-

బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో వ్యక్తిగత ఋణం తీసుకోవాలని భావిస్తున్నారా…? అయితే మీకు ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాం.

మీ అవసరం ఆధారంగా మీకు స్టేట్ బ్యాంక్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్స్ అందిస్తోంది. ఎస్‌బీఐ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ ద్వారా కస్టమర్లు త్వరగా ఋణం పొందే సదుపాయాన్ని బ్యాంకు కల్పిస్తుంది. అందుకు పెద్దగా పత్రాలతో పని లేకుండానే గరిష్టంగా 20 లక్షల వరకు రుణం తీసుకునే సదుపాయం ఉంటుంది. తక్కువ వడ్డీకే రుణాన్ని స్టేట్ బ్యాంకు అందించడం విశేషం.

తక్కువ ప్రాసెసింగ్ ఫీజు పడటమే కాకుండా డైలీ రెడ్యూసింగ్ బ్యాలెన్స్‌పై వడ్డీ విధిస్తారు. జీరో హిడెన్ చార్జీలు. ఎలాంటి సెక్యూరిటీ కానీ గ్యారంటీ కానీ పెట్టకుండానే లోన్ పొందవచ్చు. అయితే కొన్ని కొన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. లోన్ పొందాలని భావించే వారు ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్ ఉండటమే కాకుండా నెల జీతం రూ.15,000 తప్పనిసరిగా ఉండాలి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు,

ప్రభుత్వ రంగ సంస్థలు, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్, పలు కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే వారికి లోన్ పొందే సదుపాయం ఉంటుంది. ఎస్‌బీఐ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజు రుణ మొత్తంలో 1.5 శాతంగా అంటే, రూ.1,000 నుంచి రూ.15,000 వరకు పడుతుంది. ప్రిపేమెంట్ చార్జీలు కూడా విధిస్తారు. తీసుకున్న రుణాన్ని 6 నెలల నుంచి 6 ఏళ్లలోపు తిరగి చెల్లించాల్సి ఉంటుంది.

వడ్డీ రేటు 11.5 శాతం నుంచి మొదలవుతుండగా ఈ లోన్ కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. మీ అర్హతను తెలుసుకోవచ్చు. దీని కోసం ఎస్‌బీఐ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. కింది లింక్‌పై క్లిక్ చేసి నేరుగా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.https://sbi.co.in/web/personal-banking/loans/personal-loans/xpress-credit-personal-loan#show

Read more RELATED
Recommended to you

Latest news