SBI: మినీ స్టేట్మెంట్ కావాలా..? ఇలా జస్ట్ మిస్డ్ కాల్ ఇస్తే చాలు..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవల వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. ఎఫ్‌డీ, పాస్‌బుక్ సేవలు ఇలా ఎన్నో అందుబాటులో ఉంటాయి. అలానే SMS ఫెసిలిటీ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి వాటిని కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తోంది. అంతే కాదు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడం నుండి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసేందుకు కూడా సరికొత్త ఫీచర్స్ ని తెచ్చింది బ్యాంకు. ఇక ఈరోజు బ్యాంక్ మినీ స్టేట్‌మెంట్ గురించి చూద్దాం.

బ్యాంక్ మినీ స్టేట్‌మెంట్ ని కూడా మీరు సులభంగానే పొందొచ్చు. ఏమి కష్ట పడాల్సిన పని లేదు. బ్యాంక్ మినీ స్టేట్‌మెంట్‌తో మనం చేసే ట్రాన్సాక్షన్స్ అన్నింటి డీటెయిల్స్ ని కూడా మీరు తెలుసుకోచ్చు. ఎప్పుడు ఎంత ఖర్చు చేస్తున్నాం అనేవి మినీ స్టేట్మెంట్ లో ఉంటాయి. ఎస్‌బీఐ క్విక్ బ్యాంకింగ్, SMS బ్యాంకింగ్, మిస్డ్ కాల్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా SBI బ్యాంక్ మినీ స్టేట్‌మెంట్ ని పొందవచ్చు. మినీ స్టేట్‌మెంట్ పొందాలంటే మీ మొబైల్ నంబర్ బ్యాంక్ అకౌంట్‌ తో రిజిస్టర్ అయ్యి ఉండాలి. స్టేట్‌మెంట్‌లో RTGS, UPI, IMPS, NEFT ఇలా అన్నీ కనపడతాయి.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా పొందొచ్చు. 9223766666 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు మెసేజ్ వస్తుంది. ఇలా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. మినీ స్టేట్‌మెంట్ కావాలంటే 09223866666 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి. మీ చివరి 5 ట్రాన్సాక్షన్ల వివరాలు మెసేజ్ రూపంలో వస్తాయి. ఇలా ఈజీగానే మెసేజ్‌తోనే చేసుకోవచ్చు. REG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నంబర్ ఎంటర్ చేసి 09223488888 నంబర్‌కు మీరు మెసేజ్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version