కేంద్రం నుండి అదిరే స్కీమ్… రూ.50 వేల లోన్.. 7 శాతం సబ్సిడీ, క్యాష్‌బ్యాక్ కూడా…!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా మంది ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను కేంద్రం తీసుకు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం లోని కేంద్ర సర్కార్ 2020, జూన్‌ లో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధిగా పిలిచే స్కీమ్ ఇది. పీఎం స్వనిధి అని కూడా అంటారు. ఈ స్కీము కింద దాదాపు వడ్డీ లేని రుణాలను పొందొచ్చు.

వీధి వ్యాపారులకు సూక్ష్మ క్రెడిట్ సౌకర్యాలను అందించాలని తీసుకొచ్చారు. ఈ పథకం లబ్ధిదారులకు లోన్ వస్తుంది. పైగా ఎలాంటి పూచీకత్తు లేకుండానే. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూసేద్దాం. 50 లక్షల మంది విక్రేతలకు సహాయం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ స్కీము ద్వారా
అతి తక్కువ వడ్డీకే రూ.50 వేల వరకు లోన్ ని పొందొచ్చు. 12 నెలల్లోపు ఈ రుణాలు తిరిగి చెల్లించాలి. ఈ పథకం కింద మొదటి విడత లో రూ.10 వేలు లోన్ వస్తుంది.

ఒకవేళ కనుక దానిని సరైన టైం కి కట్టేస్తే రెండో దఫాలో రూ.20 వేల, మూడో విడతలో రూ.50 వేల వరకు లోన్ పొందవచ్చు. కాల వ్యవధికి ముందే మీరు లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే 7 శాతం సబ్సిడీ ఉంటుంది. డిజిటల్‌గా రుణాన్ని తిరిగి చెల్లిస్తే దాదాపు రూ.12 వందల వరకు క్యాష్‌బ్యాక్ ని పొందొచ్చు. బ్యాంకులు, ప్రాంతీయ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల విధించే వడ్డీ ని బట్టీ ఉంటుంది. మార్చి 24, 2020 కటాఫ్ తేదీ కంటే ముందు వీధి వ్యాపారులగా ఉన్నట్లయితేనే ఈ స్కీమ్ ని పొందొచ్చు. వెండింగ్ సర్టిఫికేట్ లేదా గుర్తింపు కార్డు పక్కా ఉండాలి. సర్టిఫికెట్ లేకపోతే తాత్కాలిక సర్టిఫికెట్ సమర్పించడం ద్వారా ఈ పథకాన్ని పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version