స్టేట్ బ్యాంక్ నుండి అదిరే స్కీమ్.. ప్రతీ నెలా డబ్బులు వస్తాయి..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి ఎంతో ప్రయోజనం కలుగుతోంది. ఎస్‌బీఐ తన కస్టమర్లకు స్సెషల్ స్కీమ్స్ ని కూడా తెచ్చింది. దీని పేరు ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్. ఈ పథకం లో ఒక్కసారి డబ్బులు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. 3 ఏళ్ల నుంచి పదేళ్ల వరకు డబ్బులని పొందవచ్చు. 36 నెలలు, 60 నెలలు, 120 నెలల ఆప్షన్లు దీనిలో ఉంటాయట.

కావాల్సిన దాన్ని ఎంపిక చేసుకోచ్చు. దానికి అనుగుణంగా మీకు ప్రతి నెలా డబ్బులు చెల్లించాల్సి వుంది. కనీసం రూ. 1000 నుంచి కూడా మీరు ఈ స్కీమ్ తో పొందవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా మీకు వచ్చే యాన్యుటీ కూడా మారుతుంది. గరిష్ట పరిమితి ఏమీ ఉండదు.

ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. టర్మ్ డిపాజిట్లకు వర్తించే వడ్డీ రేటు వర్తిస్తుంది. లోన్ ఫెసిలిటీ కూడా వుంది. ఎస్‌బీఐ 7 రోజుల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో ఎఫ్‌డీ స్కీమ్స్ ని ఇస్తోంది. 5 ఏళ్ల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో డబ్బులు డిపాజిట్ చేసుకోవాలని భావిస్తే.. గరిష్టంగా 7.5 శాతం వడ్డీ వస్తుంది. కనీసం రూ. 25 వేలు డిపాజిట్ చేసి ఇందులో చేరచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news