ఒత్తిడి నుండి ఈ ఆహారంతో బయపడండి…!

-

మనకి ఎక్కువ పనులు ఉంటూ ఉంటాయి. ప్రతి రోజూ ఎన్నో పనులు చేసి తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటాము. ఎక్కువ గంటలు పని చేయడం కుటుంబ బాధ్యతలు ఇలా ఎన్నో వాటి వల్ల ఒత్తిడి కలుగుతుంది. వ్యక్తిగత జీవితం పై ఇది బాగా ప్రభావం చూపుతుంది.

stress

స్వభావంలో కూడా ఒత్తిడి మనకు కనబడుతుంది. అస్తమానూ చికాకుగా ఉండడం, ఆందోళన చెందడం ఇలాంటివి మనం గమనించవచ్చు. అయితే ఒత్తిడి కి చెక్ పెట్టడం చాలా ముఖ్యం. అయితే ఎలా ఒత్తిడి నుండి దూరంగా ఉండాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఒత్తిడిని తొలగించే ఆహార పదార్థాల గురించి చూసేయండి.

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. కోకో లో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. మానసిక స్థితిని ఇది మెరుగుపరుస్తుంది. కనుక ఒత్తిడి ఎక్కువగా వుండే వాళ్ళు డార్క్ చాకోలెట్ ని తీసుకుంటే మంచిది.

క్యాప్సికం:

క్యాప్సికం లో విటమిన్ ఏ, బి6 పుష్కలంగా ఉంటాయి. మెదడు అభివృద్ధికి ఇది బాగా ఉపయోగ పడుతుంది.

ఒమేగా త్రీ:

ఒమెగా త్రీ ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. మనకి సాల్మన్, అవిసె గింజలు, చియా సీడ్స్ లో ఒమేగా 3 ఎక్కువగా ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

కెఫీన్:

కెఫీన్ కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే ఒకవేళ నిద్రలేమి సమస్య ఉంటే మాత్రం కెఫిన్ కి దూరంగా ఉండాలి. అలానే నట్స్, పెరుగు, గ్రీన్ టీ కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి. కనుక ఈ ఆహార పదార్ధాలని తీసుకుని ఒత్తిడి నుండి దూరంగా వుండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version