చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు.
అయితే.. తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ భార్య ఇందిరా దేవి గారు మరణించారు. ఆమె గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఈ నేపథ్యంలోనే ఆమె నిన్న రాత్రి మరణించారని సమాచారం. దాదాపు నెల రోజుల నుండి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఇందిరా దేవి..నిన్న రాత్రి మరణించారట. అయితే.. దీనిపై ఎలాంటి మహేష్ బాబు కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది.
Superstar @urstrulyMahesh 's mother Indira Devi garu passed away a few minutes back. Prayers & strengths to superstar family in these grief hours. Om shanti Indira Devi garu 🙏 pic.twitter.com/jIfMBLZRf0
— Viswa CM (@ViswaCM1) September 28, 2022
Superstar @urstrulyMahesh 's mother Indiramma garu passed away. She was truly a wonderful woman. My deepest condolences to the family. Om shanti🙏 pic.twitter.com/dEqa5okDRA
— Sai Varun S (@varungds) September 28, 2022