టాప్‌ ప్లేస్‌లోకి ఢిల్లీ..ఆ మూడు టీంలు ప్లే ఆఫ్ కు కష్టమేనా…?

-

ఐపీఎల్‌లో నిన్న జరిగిన రెండు మ్యాచ్‌లు.. ప్రేక్షకులకు వీకెండ్‌ మజా ఇచ్చాయి. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఆర్సీబీ ఆటగాడు చెడుగుడు ఆడుకోగా.. రెండో మ్యాచ్‌లో చెన్నైపై సెంచరీతో విరుచుకుపడ్డాడు ఢిల్లీ ప్లేయర్‌ ధావన్. 58 బంతుల్లో 101 పరుగులు చేసి.. చెన్నైకి చెక్‌ పెట్టడంలో కీలకపాత్ర పోషించాడు శిఖర్‌ ధావన్‌. జడేజా వేసిన ఆఖరి ఓవర్‌లో విజయానికి 17 పరుగులు అవసరమవ్వగా.. అక్షర్‌ పటేల్‌ మూడు సిక్సులు కొట్టి ఢిల్లీకి విజయం ఖాయం చేశాడు.

తాజా విజయంతో ఢిల్లీ టాప్‌ ప్లేస్‌లోకి వెళ్లింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ ఓటమితో చెన్నైకి ప్లే ఆఫ్‌ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. రాజస్థాన్‌ పరాజయాల పరంపర కొనసాగిస్తుంది. ఇక రాజస్థాన్,పంజాబ్ జట్లకు కూడా ప్లే అవకాశాలు సంకిష్టంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version