గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన చేసింది. అదేంటంటే మునిసిపల్ న్నికల్లోలో పోటీ చేయాలనుకునే వారు ఒక్క డివిజన్ నుండి మాత్రమే పోటీ చేయాలని, ఒకటి కన్నా ఎక్కువ చోట్ల నామినేషన్ వేస్తే నామినేషన్ ల ఉపసంహరణ లోపు ఒక్క దగ్గర మినహా మిగతా అన్ని చోట్ల విత్ డ్రా చేసుకోవాలని పేర్కొంది.
అలా కాకుండా విత్ డ్రా చేసుకోకపోతే అన్ని డివిజన్ లలో నామినేషన్స్ తిరస్కరించబడుతుందని పేర్కొంది. డిసెంబర్ మొదటి వారంలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ దిశగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో గ్రేటర్ ఎన్నికల నిర్వహణపై ఏకాభిప్రాయం వచ్చినట్టు చెబుతున్నారు. మరో వైపు రేపు ఓటర్ల జాబితా వెలుడనుంది. దీపావళి తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి.