వర్మ కి జిహెచ్ఎంసి ఫైన్.. పవన్ ఫ్యాన్స్ హ్యాపీ…!?

-

చిత్ర పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వర్మ ను అభిమానించే వారు ఎంతమంది ఉన్నారో.. ఈయనను తిట్టుకునే వారు కూడా అంతే మంది ఉన్నారు. వర్మ చేసే వ్యాఖ్యలు.. సినిమాలు అన్ని వివాదాస్పదంగా ఉంటాయి. తన జీవితంలో ఎలాంటి రూల్స్ లేవని తన ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతాను అంటూ వర్మ ఎప్పుడూ చెబుతూ ఉంటారు. కానీ జిహెచ్ఎంసి అధికారులు మాత్రం వర్మ రూల్స్ పాటించాల్సిందే అంటూ చెబుతున్నారు.

రూల్స్ బ్రేక్ చేసినందుకు రామ్ గోపాల్ వర్మ కు ఏకంగా జిహెచ్ఎంసి ఫైన్ వేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పోస్టర్లకు సంబంధించి జిహెచ్ఎంసి రామ్ గోపాల్ వర్మ కు నాలుగు వేల రూపాయల జరిమానా విధించింది. లాక్ డౌన్ తర్వాత పవన్ కళ్యాణ్ మొదటి పోస్టర్ అంటూ వర్మ విడుదల చేసిన ఒక పోస్టర్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేయడంతో… స్పందించిన జిహెచ్ఎంసి అధికారులు సంచలనాల దర్శకుడు వర్మ కు నాలుగు వేలు జరిమానా విధించడం ప్రస్తుతం సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version