షాకింగ్ : హైదరాబాద్ లో 90 శాతం ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ లేదు !

-

ఏపీలో జరిగిన స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. దీంతో జిహెచ్ఎంసికి చెందిన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈరోజు హైదరాబాద్ లో ఆకస్మిక తనిఖీలు చేసింది. ఈ తనిఖీల్లో హైదరాబాద్ లో నిబంధనలు పాటించని ప్రైవేటు ఆసుపత్రులను భారీ సంఖ్యలో గుర్తించారు. నూటికి 90 శాతం ఆసుపత్రుల్లో ఫైర్ నిబంధను పాటించడం లేదని గుర్తించారు అధికారులు. దాదాపుగా 1600 హాస్పిటల్స్ నిబంధనలు పాటించడం లేదని జిహెచ్ఎంసి స్పెషల్ డ్రైవ్ లో గుర్తించారు. జిహెచ్ఎంసి పరిధిలో 1721 హాస్పిటల్స్ కు హెల్త్ డిపార్ట్మెంట్ లైసెన్సులు ఇచ్చింది.

నిబంధనలు పాటించని ఆసుపత్రుల క్షేత్ర స్థాయి రిపోర్టును జిహెచ్ ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ తయారు చేసింది. నూటికి 90 శాతం ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే బయటపడే మార్గాలు లేవని కొన్ని ఆసుపత్రుల్లో అయితే అసలు పూర్తి స్థాయిలో ఫైర్ ఎక్విప్ మెంట్ లేదని, సెల్లార్లే ల్యాబ్స్ గా, మెడికల్ షాపులుగా చాలా ఆసుపత్రులు ఉపయోగిస్తున్నట్టు తేల్చారు. అంతేకాక ఎక్కువ శాతం ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్ లు రెసిడెన్షియల్ భవనాల్లో ఉన్నాయని గుర్తించారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ హాస్పిటల్స్ ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం నోటీసులు జారీ చేసింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలపై ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్స్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వడంతో వాటి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version