CBI: వివేకా హత్య కేసుతో అవినాష్ రెడ్డికి సంబంధం ఉంది!

-

CBI: తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన మాజీ మంత్రిపై వివేకానంద రెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడడం లేదు. హత్యకు వాస్తవ కారణాలు ఏంటి..? అసలు హత్య జరిగిన రోజు ఏం జరిగింది..? హత్య జరిగి దాదాపు ఐదేళ్లు అవుతున్న ఎందుకు మర్డర్ మిస్టరీ వీడడం లేదు..? ఈ కేసులో అసలు దోషులను ఎందుకు నిర్ధారించలేకపోతున్నారు..? అని ఇలా ఎన్నో అనుమానాలు వెంటాడుతున్నాయి.

అయితే తాజా పరిణామాలు చూస్తుంటే మాత్రం కేసు ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై కోర్టుకు సమర్పించిన చార్జీ షీట్ లో సిబిఐ కీలక విషయాలని వెల్లడించింది. వివేక హత్య కేసుతో అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని సుప్రీంకోర్టుకు సీబీఐ చెప్పినట్టు తెలుస్తోంది. వివేక హత్యకు ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కుట్ర చేశారని సిబిఐ సుప్రీంకోర్టుకు వెల్లడించింది.

ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని తెలిపింది సిబిఐ. హత్యకు గల కారణాలు, ఎవరెవరు ఎక్కడి నుండి ఇంట్లోకి వచ్చారో చెప్పే మ్యాప్, అవినాష్ రెడ్డికి గల సంబంధం తదితర అంశాలను వివరిస్తూ కోర్టుకు సమర్పించిన ఫైనల్ ఛార్జ్ షీట్ లో సిబిఐ వెల్లడించిందని సమాచారం. ఇక ఈ కేసులో అవినాష్ రెడ్డిని A8 గా చేర్చడంతోపాటు జూన్ లో అవినాష్ రెడ్డి ని అరెస్ట్ చేసి అనంతరం బెయిల్ పై విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version