GHMC స్టాండింగ్ కమిటీ ఎన్నిక నామినేషన్ దాఖలుకు గడువు పూర్తి అయ్యింది. ఈ నెల 10 వ తేదీ నుండి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలుకు అవకాశం కల్పించారు రిటర్నింగ్ అధికారి. గడువు పూర్తయ్యే సమయానికి స్టాండింగ్ కమిటీ ఎన్నికకు మొత్తం 17 నామినేషన్లు దాఖలు అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుండి ఏడు నామినేషన్లు.. ఎంఐఎం నుండి 8 ఎనిమిది నామినేషన్లు దాఖలు కాగా.. బిఆర్ఎస్ నుండి 2 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
ఇక ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు దూరంగా ఉన్నారు బీజేపీ కార్పొరేటర్లు. అయితే నామినేషన్లు దాఖలు చేసిన అన్ని పార్టీల అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించిన రిటర్నింగ్ అధికారి.. దాఖలైన నామినేషన్ల పై రేపు కమిషనర్ సమక్షంలో స్కూటీనీ నిర్వహించనున్నారు రిటర్నింగ్ అధికారి. ఆ స్కూటినీ అనంతరం ఫైనల్ లిస్టును ప్రకటించనున్న రిటర్నింగ్ అధికారి.. 21వ తేది వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. అయితే బిఆర్ఎస్ నుండి దాఖలైన రెండు నామినేషన్లు ఉపసంహరణ జరిగితే స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. బిఆర్ఎస్ సభ్యులు ఉపసంహరణ చేసుకోకపోతే మాత్రం 25వ తేదీన ఎన్నిక జరుగుతుంది.