రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. అర్హులందరికీ కార్డులు ఇవ్వాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాలలో కార్డుల పంపిణీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటికే కొత్త కార్డులకు సంబంధించి సీఎం పలు డిజైన్లు పరిశీలించారు.
ఇప్పటికే లక్షలాది సంఖ్యలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కొత్త వారితో పాటు కార్డులు ఉన్న వారు కూడా కొత్తగా సభ్యులను చేర్చేందుకు దరఖాస్తులు చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెల్లారు. అయితే ప్రజాపాలన, గ్రామ సభల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ మీ సేవా సెంటర్ల వారు గిరాకీ కోసం అధికారులు చేయరు.. మేమే చేస్తాం అంటూ పలువురు పేర్కొనడం గమనార్హం. మరికొందరూ మాత్రం పాత రేషన్ కార్డును తొలగించుకోకపోవడం ద్వారా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే పెండింగ్ రావడం విశేషం.