మొబైల్స్ తయారీదారు జియోనీ కొత్తగా జియోనీ మ్యాక్స్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ ను భారత్‌లో విడుదల చేసింది. జియోనీ నుంచి వచ్చిన అత్యంత తక్కువ ధర కలిగిన ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో 6.1 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ను అందిస్తున్నారు. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. కానీ ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను అందిస్తున్నారు. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇందులో అమర్చారు.
జియోనీ మ్యాక్స్ స్పెసిఫికేషన్లు…
* 6.1 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1560 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
* 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10
* డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు
* 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
జియోనీ మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ బ్లాక్, రెడ్, రాయల్ బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఆగస్టు 31 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో రూ.5,999 ధరకు లభిస్తుంది.