తనకు ఇష్టమైన టమాటాల కోసం ఓ యువతి అమానుషంగా ప్రవర్తించింది. వద్దన్న కుటుంబీకులపై దారుణానికి ఒడి గట్టింది. దీంతో కోపంతో ఊగి పోయిన ఆ యువతి సొంత తాతపైనే దారుణంగా ప్రవర్తించింది.కేవలం టమాటాల కోసం 19 ఏళ్ల యువతి ఇలా ప్రవర్తించింది. ఆమె చేసిన పనికి పోలీసు కేసు కూడా నమోదు కావడంతో జైలు పాలయ్యింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం నాసావు కౌంటీలో ఈ ఘటన ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
పోలీసుల వివరాల ప్రకారం
కేటీ జాడే గేట్స్(19) అనే యువతి తన తాతయ్య, నాన్నమ్మలతో కలిసి నాసావు కౌంటీలోని కల్లాహన్ టౌన్‌లో నివాసముంటోంది. ఈ క్రమంలో ఈ నెల 12న రాత్రి భోజనం సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి కేటీ జాడే డిన్నర్‌కు ఉపక్రమించింది. టమోటాలు అంటే ఎంతో ఇష్టంగా తినే ఆమెకు ఆ రోజు తన వాటా కంటే ఎక్కువ తింటానని పట్టుబట్టింది. దానికి ఆమె తాతయ్య అంగీకరించలేదు. అంతే.. కేటీ జాడే ఒక్కసారిగా ఆగ్రహానికి గురైంది.