ఆర్టీసీ బ‌స్సు లో బాలిక, ఆటో డ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్య కారణం ఎంటంటే?

-

భ‌ద్రాద్రి కొత్త గూడెం జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. తెలంగాణ ఆర్టీసీ బ‌స్సు లో ఒక బాలిక తో పాటు ఆటో డ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. అయితే వీరు ఇద్ద‌రు గ‌త కొద్ధి రోజుల నుంచి ప్రేమించు కుంటున్నార‌ని తెలుస్తుంది. అయితే పాఠ‌శాల‌కు వెళ్లాల్సిన త‌మ కూతురు విగ‌త జీవి గా ఉండ‌టం చూసి బాలిక త‌ల్లిదండ్రులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే కొత్త‌గూడెం లోని చండ్రుగొండ మండ‌లం సీతాయి గూడెం లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స‌ర్వేష కృష్ణ‌వేని దంపుత‌ల కు అనూష (14) పెద్ద కూత‌రు. అనూష 9 వ త‌ర‌గ‌తి చ‌దువుతుంది.

అదే గ్రామానికి చెందిన జగ్గార‌వు (28) ఆటో న‌డుపుతూ ఉంటాడు. అయితే జ‌గ్గా రావు గ‌త అనూష ను ప్రేమ పేరు తో మ‌భ్య పెట్టాడ‌ని తెలుస్తుంది. అయితే సోమ‌వారం అనుష స్కూల్ కి వెళ్లిన త‌ర్వాత తిరిగి ఇంటి కి రాలేదు. అయితే అనూష ను జ‌గ్గారావు తీసుకు వెళ్లిన‌ట్టు తెలుస్తుంది. రెండు రోజుల త‌ర్వాత మంగ‌ళ వారం సాయంత్రం అశ్వారావు పేట బ‌స్సు లో పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. అయితే ఆ బ‌స్సు డ్రైవ‌ర్, కండ‌క్ట‌ర్ చూసి బ‌స్సు లో నే ఆస్ప‌త్రి కి తీసుకువ‌చ్చారు. చికిత్స అందిస్తున్న స‌మ‌యంలో నే ఇద్ద‌రూ కూడా మృతి చెందారు. అయితే పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version