బాయ్ ఫ్రెండ్ తో రోడ్డు పై కనిపించిన కూతురు…కోపంతో తండ్రి ఏం చేశాడంటే..?

యువతీ యువకులు తల్లి తండ్రుల కళ్ళు కప్పి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు. ఫ్రెండ్ ఇంటికి …కాలేజీకి అని చెప్పి బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ తో చక్కర్లు కొట్టి వస్తుంటారు. అయితే అలాంటి సమయం లో తల్లి తండ్రుల కంట పడితే సీన్ ఎలా ఉంటుందో ఊహించలేం. అయితే అలాంటి ఘటనే మధ్యప్రదేశ్లోని హర్దా జిల్లాలో చోటు చేసుకుంది. యువతి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా యువతి తండ్రి ఎంట్రీ ఇచ్చాడు. దాంతో యువతీయువకులు షాకయ్యారు.

ఇక ఎంట్రీ ఇచ్చిన వెంటనే కూతురుని ఆ వ్యక్తి తో చేసిన తండ్రి ఆగ్రహం తో ఊగిపోయారు. వెంటనే ప్యాంట్ కి ఉన్న బెల్ట్ ను తీసి వాయించడం మొదలుపెట్టారు. మొదట యువకుడిని చితకబాదిన తండ్రి ఆ తర్వాత కూతురిని సైతం అదే రేంజ్ లో కొట్టాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇక తనను అనవసరంగా కొట్టాడు అంటూ యువకడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడం తో యువతి తండ్రి పైన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.. మంచి పని చేశారు అంటూ సపోర్ట్ చేస్తున్నారు.