అన్నా అని పిలిచిన వ్యక్తినే పెళ్లిచేసుకున్నానన్న యువతి….నెట్టింట వైరల్

-

అన్నా అని పిలిచిన వ్యక్తినే చివరకు పెళ్లాడానంటూ ఓ యువతి సోషల్ మీడియాలో పంచుకుంది. దీనిపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్లితే…. ఎనిమిదేళ్ల పాటు అన్నా అని పిలిచిన వ్యక్తినే చివరకు పెళ్లాడానంటూ ఓ యువతి నెట్టింట పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. విని అనే యువతి ఇన్‌స్టాలో ఈ విషయాలను పంచుకుంది. తన భర్త పేరు జెయ్ అని చెప్పింది. తమ మధ్య దూరపు చుట్టరికం ఉందని, అయితే జెయ్ తన కంటే పెద్దవాడు కావడంతో అతడు ఎప్పుడు కనిపించినా అన్నా అని పిలుస్తుండేదానన్ని చెప్పుకొచ్చింది.

తమకు ఓ బిడ్డ కూడా ఉన్నాడని చెప్పుకొచ్చింది. అన్నయ్యే ప్రియుడు అయ్యాడనే అర్థం వచ్చేలా ‘భయ్యా సే సయ్యా’ అంటూ తమ ఫొటోలకు ఓ క్యాప్షన్ కూడా జత చేసింది. అయితే, యువతి తీరు పట్ల నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. వయసులో పెద్దవాళ్లను అన్నా అని పిలిచినంత మాత్రాన వాళ్లు మనకు వరుసకు అన్నదమ్ములు కారని ఆమెను సమర్థిస్తూనే ఆమె పెట్టిన క్యాప్షన్ పట్ల విముఖత వ్యక్తం చేశారు. మరీ అన్నయ్యే ప్రియుడు అయ్యాడు అనే అర్థం వచ్చే క్యాప్షన్ పెట్టడం ఏమాత్రం సబబుగా లేదని కుండబద్దలు కొట్టారు. యువతి పెట్టిన క్యాప్షన్ ఎబ్బెట్టుగా ఉందని అధికశాతం మంది అభ్యంతరాలు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version