ఢిల్లీలో నేడు (ఆదివారం) జరగనున్న నీతి అయోగ్ మీటింగ్ ను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందేే. కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన తెలియజేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి నిన్నటి మీడియా సమావేశంలో తెలియజేశారు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీకి లేఖ ద్వారా తెలియజేశామని తెలిపారు. అయితే కెసిఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుర్చీ ఎట్లా కాపాడుకొనుడొ అని కుట్రలు చేసుడు మానేసి ఢిల్లీకి పోవాలంటూ సూచించారు.” అడగాల్సిన చోటుకు అలిగి పోకుంటే ఆగం ఐతమ్ దొరా.. ఎదురుపడలేక ఏతులు కొడితే.. కడుపు ఎండుతది దొరా.. తమరి మూర్ఖ రాజకీయాలకు .. తెలంగాణను తగలపెట్టకు.. కుర్చీ ఎట్లా కాపాడుకొనుడు అని కుట్రలు చేసుడు మానేసి.. ఢిల్లీకి పో.. రాష్ట్రానికి రావలసిన దాని గురించి కొట్లాడు.” అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
అడగాల్సిన చోటుకు అలిగి పోకుంటే ఆగం అయితం దొరా.. ఎదురుపడలేక ఏతులు కొడితే.. కడుపెండుతది దొరా. తమరి మూర్ఖ రాజకీయాలకు.. తెలంగాణను తగలపెట్టకు. కుర్చి ఎట్లా కాపాడుకునుడో అని కుట్రలు చేసుడు మానేసి.. డిల్లీకి పో.. రాష్ట్రానికి రావల్సినదాని గురించి కొట్లాడు. pic.twitter.com/BqJhJSya5c
— YS Sharmila (@realyssharmila) August 7, 2022