అల్లు అర్జున్ కు ఇచ్చిన నోటీసులో కీలక విషయాలు పేర్కొన్న పోలీసులు..!

-

అనుమతి ఇచ్చినా చివరి నిముషం లో ఆస్పత్రి పర్యటన రద్దు చేసుకున్నాడు అల్లు అర్జున్. అయితే నిబంధనలకు లోబడైతే ఎపుడైనా ఏర్పాట్లు చేస్తాం అంటున్నారు పోలీసులు. కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజను పరామర్శించేందుకు అల్లు అర్జున్ వస్తాడని తెలిసి అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాము. కానీ చివరి నిమిషంలో అల్లు అర్జున్ మేనేజర్ ద్వారా కిమ్స్ హాస్పిటల్ కి రావట్లేదని మాకు సమాచారం వచ్చింది. కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందతున్న శ్రీ తేజను పరామర్శించేందుకు మీరు ఎప్పుడు వచ్చినా ఏర్పాట్లతో సిద్ధంగా ఉంటాము.

కానీ గంట ముందు సమాచారం ఇస్తే చాలు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాము. అలాగే కిమ్స్ హాస్పిటల్ కి వచ్చే విషయాన్ని రహస్యంగా ఉంచాలి. ఎందుకంటే కిమ్స్ హాస్పిటల్ లో ఉన్న ఇతర పేషంట్లకి, వాళ్ళ అటెండెన్స్ కి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అలాగే మీరు కిమ్స్ హాస్పిటల్ కి వచ్చి తిరిగి వెళ్లేంతవరకు కూడా అవసరమైన ఎస్కార్ట్ ని ఏర్పాటు చేస్తాము అని అల్లు అర్జున్ కు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు రాంగోపాల్ పేట్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version