LIGER : “లైగర్” ఫస్ట్ గ్లింప్స్ విడుదల..ఇక దేవరకొండ ఫాన్స్ కు జాతరే

-

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న తాజా సినిమా లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకోగా.. ప్రస్తుతం ప్రమోషన్‌ పనిలో పడింది చిత్ర బృందం. ఇక ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు.

అయితే తాజాగా లైగర్ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది.  విజయ్ దేవరకొండ “లైగర్” ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసింది చిత్ర బృందం. పూరీ మార్క్ యాక్షన్ సన్నివేశాలతో రౌడీ బాయ్..ఈ గ్లింప్స్‌ లో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చేశాడు. అంతేకాదు.. పవర్‌ ఫుల్‌ బాడీతో… రింగ్‌ లోకి ఎంట్రీ ఇచ్చే సీన్‌ అదిరిపోయింది. ఈ గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను భారీ గా పెంచేశాయి. కాగా.. ఈ సినిమా ఆగస్టు 25 వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version