Pakka Commercial : దీపావళి గిఫ్ట్ ఇచ్చేసిన గోపిచంద్‌

-

ప్రతి రోజు పండగే లాంటి బ్లాక్‌ బ్లస్టర్‌ సక్సెస తర్వాత…విలక్షణ దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్‌. మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ సమర్పణ లో సక్సెస్‌ ఫుల్‌ బ్యానర్లు గా అందరి మనస్సులు అందుకుంటూ ముందుకు సాగుతున్న జీఏ 2 పిక్చర్స్‌ – యూవీ క్రియేషన్స్‌ కలిసి మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ ప్రొడ్యూసర్‌ బన్నీ వాసు నిర్మాతగా మ్యాచో హీరో గోపీచంద్‌ తో పక్కా కమర్షియల్‌ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి.

ఈ టైటిల్‌ కు అటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇక ఈ సినిమా లో మ్యాచో హీరో గోపీచంద్‌ సరసన… రాశి ఖన్నా హీరోయిన్‌ గా నటిస్తుంది. అయితే.. దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి ఓ అదరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా గ్లింప్స్‌ ను తాజాగా వదిలింది చిత్ర బృందం. గ్లింప్స్‌ తో పాటు ఈ సినిమా టీజర్‌ ను నవంబర్‌ 8 వ తేదీన సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇక ఈ గ్లింప్స్‌ లో హీరో గోపీచంద్‌ చాలా గ్లామర్‌ గా కనిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news