కొత్త జీవో 13 ఎఫెక్ట్‌ : రాధ్యే శ్యాం, RRR, సినిమాలకు షాక్‌ !

-

విజయవాడ : సినిమా టికెట్ల ధరులు పెంచుతూ.. ఏపీ సర్కార్‌ నాలుగు రోజుల కింద కొత్త జీవో 13ను తీసుకొచ్చింది. అయితే… కొత్త జీవో 13 తో రాధ్యే శ్యాం, RRR, ఆచార్య లాంటి పెద్ద సినిమాలకు తిప్పలు తప్పడం లేదు. ఈ కొత్త జీవో 13 ప్రకారం.. రూ. 100 కోట్లు దాటినా పెద్ద బడ్జెట్ సినిమాలు ఇష్టానుసారంగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లేదు. అటు రేపు విడుదల కానున్న రాధ్యే శ్యాం సినిమాకు ఇంకా టికెట్స్ విడుదల కాలేదు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ నిరాశకు లోనవుతున్నారు.

జీవో 13 ప్రకారం ఏపీ లో 20 శాతం షూటింగ్ తీసిన హై బడ్జెట్ సినిమాలకు మాత్రమే 10 రోజుల పాటు ధరలు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్దంగా వున్న పెద్ద సినిమాలకు కొత్త జీవో వర్తించదని జీవో లో స్పష్టంగా పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే… కేవలం పది రోజుల పాటు ధరలు పెంచే అవకాశం ఇవ్వాలి అంటూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ చుట్టూ తిరుగుతున్నారు ప్రొడ్యూసర్స్. ధరల కన్ఫ్యూషన్ లో రాధ్యే శ్యాం టికెట్స్ కౌంటర్స్ ఇంకా ఓపెన్ కానీ పరిస్థితి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version