గుడ్ న్యూస్.. గోవా పర్యటనకు గ్రీన్ సిగ్న‌ల్..!

-

భారతదేశంలో లాక్ డౌన్ అమలు చేసి ఇప్పటికే 100 రోజులు పూర్తి అయిపోయింది. వంద రోజులు పూర్తి అయిన తరువాత గోవాలో టూరిస్టుల ప‌ర్య‌ట‌న‌కు అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించింది. నేటి(జులై 2) నుంచి భారత ప‌ర్యాట‌కుల‌కు ప‌ర్మిష‌న్ ఇస్తున్న‌ట్టు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మనోహర్ వెల్ల‌డించారు. దీని కోసం మొత్తం 250 హోటళ్ల నిర్వహణకు అనుమతి ఇచ్చామని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలకు అనుగుణంగా హోటళ్లు నడుచుకోవాల్సి ఉంటుంద‌ని తెలిపారు.

అలాగే పర్యాటకులందరూ కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం అనుమతి లేని హోటల్స్ లో పర్యాటకులు బస చెయ్యడానికి వీలు లేదని, ఎవరైనా నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గోవా పర్యాటక మంత్రి మనోహర్ హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా కరోనా పరీక్షలు చేయించుకోకుండా వచ్చినా గోవా సరిహద్దులో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని గోవా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో ఎవరికైనా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ ఐతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాలని గోవా ప్రభుత్వం సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version