నిన్న భారీగా పతనమైన బంగారం ధర ఈ రోజు కూడా దిగొచ్చింది. గురువారం, హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.40 తగ్గింది. దీంతో ధర రూ.39,170కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.30 పడిపోయింది. దీంతో ధర రూ.35,910కు తగ్గింది. ఇకపోతే బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.90 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.47,400కు తగ్గింది.
ఢిల్లీ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పరిస్థితి వేరేలా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.37,900 వద్దనే కొనసాగుతోంది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.36,700 వద్దనే నిలకడగా కొనసాగుతోంది. పసిడి నిలకడగా ఉంటే వెండి ధర మాత్రం పడిపోయింది. ధర కేజీకి రూ.90 తగ్గుదలతో రూ.47,400కు తగ్గింది.