ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నారు. ఈ రోజు ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. నిత్యావసర ధరలు పెరుగుదల, టెలి మెడిసిన్ కేంద్రాలు పనిచేయకపోవడం, ఇళ్ల స్థలాల లబ్ధిదారుల ఎంపికలో వివక్షతపై టీడీపీ ప్రశ్నలు సంధించింది.
వేరుశనగ, పసుపు పంటలకు మద్దతుధర లేకపోవడంపై కూడా ప్రభుత్వాన్ని.. టీడీపీ ప్రశ్నించనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశముంది. మరీ ముఖ్యంగా.. ఇవాళ మూడు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలపనున్నది.