ప‌సిడి ప్రియుల‌కు గుడ్ న్యూస్‌.. భారీగా క్షీణించిన బంగారం ధ‌ర‌.. వెండి కూడా..

-

నిన్న స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర ఈ రోజు భారీగా ప‌డిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పతనమైంది. గత రెండు రోజుల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.1,340 క్షీణించింది. దీంతో పసిడి ధర రూ.39,270 నుంచి రూ.37,930కు దిగొచ్చింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. అయితే 22 క్యారెట్ల బంగారం తగ్గినంతగా దీని ధర దిగిరాలేదు. ఈ పసిడి ధర రూ.1,080 పతనమైంది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.42,860 నుంచి రూ.41,780కు క్షీణించింది.

బంగారం ధర పడిపోతే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర గత రెండు రోజుల్లో రూ.1,900 పడిపోయింది. దీంతో ధర రూ.51 వేల నుంచి రూ.49,100కు దిగొచ్చింది. ప్రస్తుతం బంగారం ధర తగ్గినా కూడా వచ్చే కాలంలో పసిడి రేటు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.50,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version