ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌.. దిగొచ్చిన బంగారం ధ‌ర‌.. వెండి మాత్రం..

-

నాలుగు రోజులుగా పెరుగుతూ వ‌స్తున్న బంగారం ధ‌ర ఈ రోజు స్వ‌ల్పంగా త‌గ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర బుధవారం తగ్గింది. రూ.40 క్షీణంచింది. దీంతో బంగారం ధర రూ.38,760 నుంచి రూ.38,720 దిగొచ్చింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం స్వల్పంగా పైకి కదిలింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ.42,230 నుంచి రూ.42,240 చేరింది. బంగారం ధర మిశ్రమంగా కదిలితే వెండి ధర మాత్రం అక్కడే కొనసాగింది. కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ధర రూ.49,600 వద్ద నిలకడగానే ఉంది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 దిగొచ్చింది. దీంతో ధర రూ.39,550కు తగ్గింది. అదే స‌మ‌యంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 తగ్గుదలతో రూ.40,750కు క్షీణించింది. ఇక కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.49,600 వద్దనే ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version