గుడ్‌న్యూస్‌: ప‌త‌న‌మైన బంగారం ధ‌ర‌.. వెండి మాత్రం..

-

నిన్న దిగొచ్చిన బంగారం ధ‌ర ఈ రోజు కూడా అదే దారిలో న‌డిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 22 క్యారెట్ల బంగారం ధర క్షీణించింది. పసిడి ధర 10 గ్రాములకు రూ.40 తగ్గింది. దీంతో ధర రూ.38,880 నుంచి రూ.38,840కు దిగొచ్చింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. రూ.20 క్షీణించింది. దీంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.42,390 నుంచి రూ.42,370కు దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం అక్కడే కొనసాగింది. కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ధర రూ.49,000 వద్దనే స్థిరంగానే కొనసాగుతోంది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.50 దిగొచ్చింది. దీంతో ధర రూ.40,850కు క్షీణించింది. అదే స‌మ‌యంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 క్షీణతతో రూ.39,650కు తగ్గింది. ఇక కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర రూ.49,000 వద్ద స్థిరంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news