ప‌సిడి ప్రియుల‌కు గుడ్ న్యూస్‌.. భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధ‌ర‌లు..!!

-

గ‌త కొద్ది రోజులుగా పైపైకి కదులుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ఈరోజు(09-04-2020) కింద‌కి ప‌డిపోయాయి. దీంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావించే ప‌స‌డి ప్రియులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర తగ్గడంతో మన దేశంలోనూ బంగారం ధర దిగొచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు.

హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.360 తగ్గుదలతో రూ.43,800కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.130 తగ్గుదలతో10 గ్రాములకు రూ.40,030కు దిగొచ్చింది. బంగారం ధరలతో పాటూ, వెండి ధరలు కూడా ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. వెండి ధర కేజీకి 330 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 40,950 రూపాయల వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు360 రూపాయల తగ్గుదలతో 43,800 రూపాయలు నమోదు చేసింది. 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 130 రూపాయల తగ్గుదల నమోదు చేసి 40,030 రూపాయలుగా నిలిచాయి. మ‌రియు వెండి కూడా త‌గ్గ‌డంతో 40,950 రూపాయల వద్దకు చేరుకుంది.

ఇక, దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర దిగొచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.120 తగ్గుదలతో రూ.44,500కు క్షీణించింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.42,170కు దిగొచ్చింది. మ‌రియు కేజీ వెండి ధర కూడా రూ.330 తగ్గింది. దీంతో ధర రూ.40,950కు క్షీణించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version